![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తి సురేశ్ నాయికగా నటిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ దుబాయ్ పరిసర ప్రాంతాల్లో జరగుతోంది.
ఇదిలా ఉంటే.. 'సర్కారు వారి పాట'లో మహేశ్, కీర్తి మధ్య సాగే లవ్ ట్రాక్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో మహేశ్ బ్లాక్ బస్టర్ మూవీ 'దూకుడు' తరహాలోనే టీజింగ్ లవ్ ట్రాక్ ఉంటుందట. మహేశ్, కీర్తి మధ్య సాగే ఈ సన్నివేశాలు చాలా హిలేరియస్ గా ఉంటాయని సమాచారం. మరి.. 'దూకుడు' లాగే 'సర్కారు వారి పాట' కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న 'సర్కారు వారి పాట'.. 2022 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |