![]() |
![]() |

కొందరు హీరోలను విలక్షణ హీరో అని, విలక్షణ నటుడు అని పిలుస్తుంటారు. కానీ, నిజానికి విలక్షణ నటుడు అనే పదానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చెయ్యగల హీరో ఉపేంద్ర. రొటీన్‌కి భిన్నంగా, ఏ హీరో టచ్ చేయలేని సబ్జెక్ట్‌తో, ఊహకు కూడా అందని క్యారెక్టరైజేషన్స్‌తో సినిమాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘ఎ’, ‘ఉపేంద్ర’ వంటి సినిమాల్లో ఉపేంద్ర పెర్‌ఫార్మెన్స్ చూసిన తర్వాత హీరోలు ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేస్తారా అని ఆశ్చర్యపోక తప్పదు. తనకంటూ సెపరేట్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఏర్పరుచుకున్న ఉపేంద్ర దాదాపు 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ‘యుఐ’ పేరుతో ఓ విభిన్న చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఉపేంద్ర ఏది చేసినా వెరైటీయే కాబట్టి ఈ సినిమా టీజర్‌ను కూడా డిఫరెంట్‌గానే ప్లాన్ చేశాడు. మూడు నెలల క్రితం విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌ను వరల్డ్ ఆఫ్ యుఐ పేరుతో విడుదల చేశారు.
జనవరి 8న బెంగుళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ హాజరయ్యారు. రీష్మా నానయ్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మనోహరన్-శ్రీకాంత్ కేపీ నిర్మిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. ఫిక్షనల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో విభిన్నంగా ఉంటుందని ఫస్ట్‌లుక్ చూస్తేనే అర్థమవుతుంది. ఎవరూ ఊహించని విధంగా సినిమా ఉంటుందని ఫస్ట్‌లుక్‌లోనే తెలియజేశాడు ఉపేంద్ర. ఈ చిత్రాన్ని 8 భాసల్లో సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
![]() |
![]() |