Home  »  News  »  సుశాంత్ మాజీ ప్రేయసికి మద్దతుగా అభిమానులు

Updated : Sep 10, 2020

రియా చక్రవర్తి తో ప్రేమలో పడటానికి ముందు చాలా ఏళ్ళ క్రితం సీరియల్ నటి అంకితా లోఖండేతో సుశాంత్ ప్రేమలో ఉన్నాడు. సుశాంత్ సూసైడ్ కేసు పలు మలుపులు తిరిగి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి చేరడం, వాళ్లు రియా చక్రవర్తి అరెస్టు చేయడం తెలిసిన విషయాలే. 

రియా చక్రవర్తి అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో అంకితా లోఖండే ఒక పోస్ట్ చేశారు. అందులో రియా చక్రవర్తి పేరు ప్రస్తావించనప్పటికీ... అదృష్టం, అవకాశాల వల్ల ఏదీ జరగదనీ, చర్యల ద్వారా ఎవరి రాత వారే సృష్టించుకుంటారనీ, అదే కర్మ అని అంకిత పేర్కొన్నారు. న్యాయం జరిగిందని తెలిపారు. రియా రాసుకున్న కర్మ అని అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉంది. 

బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. సుశాంత్ని ఇది హత్య అని తానెప్పుడూ చెప్పలేదనీ, అందుకు బాధ్యులుగా ఎవరినీ పేర్కొనలేదనీ, స్నేహితుడికి న్యాయం జరగాలని వాళ్ల కుటుంబానికి అండగా ఉన్నానని అంకిత పేర్కొన్నారు.

ద్వేషించే వాళ్లకు అంకితా లోఖండే సమాధానం చెప్పారు. "సుశాంత్ డిప్రెషన్ లో ఉంటే అతనికి డ్రగ్స్ ఇస్తారా? డిప్రెషన్ నుండి బయటపడడానికి డ్రగ్స్ ఎలా సహాయ పడతాయి? రియా ఒకవైపు వైద్యులతో మాట్లాడుతూ చికిత్స ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతూ మరోవైపు డ్రగ్స్ తో ఎలా డీల్ చేశారు?  గాడంగా ప్రేమించే వ్యక్తి ఎవరికైనా డ్రగ్స్ ఇస్తారా? మీరు అలా చేస్తారా?" అని ప్రశ్నించారు. 

అంకిత పోస్ట్ మీద శిబాని దండేకర్ దండెత్తారు. రెండు సెకండ్ల ఫేమ్ కోసం ఆమె ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో అంకితకు అభిమానులు మద్దతుగా నిలిచారు. శిబానీకి స్ట్రాంగ్ రిప్లైలు ఇచ్చారు. "అంకితకు రెండు సెకండ్ల ఫేమ్ అవసరం లేదు. టీవీలో ఆవిడ చాలా పాపులర్. ఫరాన్ అక్తర్ గర్ల్ ఫ్రెండ్ గా కాకుండా నువ్వు ఎవరు?" అని చాలామంది శిబానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "అంకిత ఫాలోయర్లు కంటే సగం ఫాలోయర్లు కూడా నీకు లేరు. నువ్వు ఫేమ్ గురించి మాట్లాడుతున్నావా?" అని ఒకరు ట్వీట్ చేశారు. "టీవీ సీరియల్ లో కష్టపడి నటించడం వల్ల అంకిత పేరు తెచ్చుకుంది. ఫరాన్ అక్తర్ తో రిలేషన్ షిప్ లో ఉండడం వల్ల నువ్వు పేరు తెచ్చుకున్నావు" అని ఇంకొకరు కామెంట్ చేశారు. అంకిత మీద విమర్శలు చేసి శివాని నెటిజన్లకు టార్గెట్ అయ్యారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.