![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం టక్ జగదీష్. పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్ సెకండ్ లీడ్ రోల్ లో దర్శనమివ్వనుంది. వెర్సటైల్ స్టార్ జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే.. టక్ జగదీష్ కి సంబంధించిన టీజర్ ని నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే టీజర్ తాలూకు అఫిషియల్ అప్ డేట్ వచ్చే అవకాశముంది. మరి.. ఎంసీఏ తరువాత సాలిడ్ హిట్ లేని నాని.. టక్ జగదీష్ తో అయినా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
కాగా, టక్ జగదీష్ తో పాటు నాని చేతిలో శ్యామ్ సింగ రాయ్, అంటే.. సుందరానికీ! చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాలు తెరపైకి వచ్చే అవకాశముంది.
![]() |
![]() |