![]() |
![]() |

తెలుగునాట అగ్ర తారగా వెలుగొందుతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే.. అవకాశం దొరికినప్పుడల్లా హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ సరసన మోహెంజోదారోలోనూ.. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితీశ్ దేశ్ ముఖ్ మల్టిస్టారర్ హౌస్ ఫుల్ 4లోనూ నాయికగా దర్శనమిచ్చింది పూజ. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ స్టారర్ కభీ ఈద్ కభీ దివాళి కాగా, మరొకటి రణ్ వీర్ సింగ్ స్టారర్ సర్కస్.
ఇదిలా ఉంటే.. సల్మాన్ నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాళి.. తమిళ చిత్రం వీరమ్ కి రీమేక్ గా తెరకెక్కుతోందని సమాచారం. వీరమ్ లో అజిత్, తమన్నా జోడీగా నటించగా.. అదే సినిమా తెలుగులో కాటమరాయుడుగా రీమేక్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్ జంటగా కనిపించారు. కట్ చేస్తే.. తమిళంలో తమన్నా, తెలుగులో శ్రుతి హాసన్ చేసిన పాత్రని ఇప్పుడు పూజ హిందీలో చేయబోతుందన్నమాట. మరి.. ఈ రీమేక్ పూజ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |