![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ పరిచయం చేసిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమాతో బోయపాటి డైరెక్టర్ అయ్యారు. మొదటి అడుగులోనే బ్లాక్ బస్టర్ కొట్టి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఆపై తులసి, సింహా, లెజెండ్, సరైనోడు వంటి ఘనవిజయాలతో అనతి కాలంలోనే అగ్ర దర్శకుడు అనిపించుకున్నారు బోయపాటి. కాగా, భద్ర విడుదలై పదహారేళ్ళవుతున్నా రవితేజ, బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. త్వరలోనే వీరి సెకండ్ జాయింట్ వెంచర్ రాబోతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తన లక్కీ హీరో నటసింహ బాలకృష్ణతో BB3 (వర్కింగ్ టైటిల్) చేస్తున్న బోయపాటి ఆ తరువాత రవితేజతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేశారని, మాస్ మహారాజా కూడా స్క్రిప్ట్ విని ఓకే చెప్పారని టాక్. త్వరలోనే రవితేజ, బోయపాటి కాంబినేషన్ మూవీకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, రవితేజ ఖిలాడి - బోయపాటి BB3.. ఒకే రోజున (మే 28) థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |