![]() |
![]() |

క్రాక్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన సదరు కాప్ స్టోరీ.. ఈ ఏడాదిలో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ ని నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో చేయబోతున్నాడు గోపీచంద్. అంతేకాదు.. క్రాక్ తరహాలోనే ఈ సినిమాని కూడా నిజ జీవిత సంఘటనలతోనే తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. మరి.. బాలయ్యతో సేమ్ ఫార్ములాని కొనసాగించబోతున్న గోపీచంద్ కి ఈ సారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
కాగా, బాలకృష్ణ - గోపీచంద్ మలినేని ఫస్ట్ జాయింట్ వెంచర్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |