![]() |
![]() |

ప్రతిరోజూ పండగే ఘనవిజయంతో మరోసారి వార్తల్లో నిలిచారు దర్శకుడు మారుతి. సదరు బ్లాక్ బస్టర్ తరువాత మారుతి నెక్స్ట్ వెంచర్ పై ఎనలేని ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో.. పలు స్టార్స్ కాంబినేషన్స్ లో తన పేరు వినిపించింది. చివరాఖరికి అది మాస్ మహారాజా రవితేజ దగ్గర ఆగింది. రవితేజకి మారుతి ఓ ఫన్ స్టోరీ చెప్పారని.. కథ నచ్చడంతో సదరు స్టార్ కూడా ఓకే చెప్పారని కొన్నాళ్ళ క్రితం కథనాలు వచ్చాయి.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్ళనుందట. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, ప్రస్తుతం రవితేజ చేతిలో క్రాక్, ఖిలాడి చిత్రాలున్నాయి. క్రాక్ ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకోగా, ఖిలాడి నిర్మాణ దశలో ఉంది.
![]() |
![]() |