![]() |
![]() |

మొదటి సినిమాతోనే పాన్ - ఇండియా హీరోయిన్ అనిపించుకున్న వైనం శ్రీనిధి శెట్టి సొంతం. 2018లో విడుదలైన `కేజీఎఫ్ః చాప్టర్ 1`తో కథానాయికగా తొలి అడుగేసిన శ్రీనిధి.. ఫస్ట్ ఫిల్మ్ తోనే సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. నాలుగేళ్ళ తరువాత వచ్చిన ఆ సినిమా సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ః చాప్టర్ 2`లోనూ కొనసాగి మరో సూపర్ సక్సెస్ ని క్రెడిట్ చేసుకుందీ అమ్మడు. మొత్తమ్మీద.. రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా హిట్స్ తో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిపోయింది శ్రీనిధి శెట్టి.
ఇదిలా ఉంటే, త్వరలో ఈ ముద్దుగుమ్మ నటించిన మూడో సినిమా రిలీజ్ కానుంది. ఆ చిత్రమే.. `కోబ్రా`. చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన ఈ తమిళ చిత్రం.. వేసవి కానుకగా మే 26న విడుదలకు సిద్ధమైంది. ఆర్. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ లో లీడింగ్ లేడీగా నటించింది శ్రీనిధి శెట్టి. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజయ్యే అవకాశముందంటున్నారు. మరి.. ఇప్పటికే రెండు ఘనవిజయాలను సొంతం చేసుకున్న శ్రీనిధి.. `కోబ్రా`తో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.
కాగా, `కోబ్రా` చిత్రానికి స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించారు.
![]() |
![]() |