![]() |
![]() |

2016వ సంవత్సరం బాగా కలిసి వచ్చిందంటే అది నానికేనని చెప్పవచ్చు. సంవత్సరానికి ఒక సినిమా వదలడానికే మిగిలిన హీరోలు ఆపసోపాలు పడుతుంటే..నాని ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసి.. మూడు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. యంగ్ హీరోల్లో వైవిధ్యం, ప్రయోగాలు అంటూ తపించేవాళ్లు ఉంటే ఆ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండే పేరు నాని. అందుకే ప్రేక్షకులు కూడా నాని సినిమాల్లో ఏదో ఓ వెరైటీ ఉంటుంది..కాబట్టి అతని సినిమా ఖచ్చితంగా చూడాలనుకుంటారు..
ఆ నమ్మకమే ఈ ఏడాది నానికి మూడు విజయాలు తెచ్చిపెట్టింది. అతను నటించిన మూడు సినిమాలు..వేటికవే డిఫరెంట్ సబ్జెక్ట్స్.."కృష్ణగాడి వీర ప్రేమగాథ" ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగే లవ్‌స్టోరీ.."జెంటిల్మెన్" ఒక సస్పెన్స్ థ్రిల్లర్..ఇక "మజ్ను" అయితే ఫుల్ లెంగ్త్ లవ్‌స్టోరీ. "కథలో కొత్తదనం", "కొత్త దర్శకులు", "కొత్త హీరోయిన్లు" ఇలా అన్నింటా కొత్త దనాన్ని నమ్ముకున్నాడు గనుకనే మిగిలిన హీరోలకు సాధ్యం కానిది..నానికి మాత్రమే సాధ్యం అయ్యింది. ఒకసారి ఆ మూడు సినిమాలను విశ్లేషిస్తే..
టైటిల్ : కృష్ణగాడి వీరప్రేమగాథ
స్టార్ కాస్ట్ : నాని, మెహ్రీన్ కౌర్
డైరెక్టర్ : హను రాఘవపూడి
విడుదల తేది : ఫిబ్రవరి 12, 2016

నాని, మెహ్రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా జంటగా హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథతో ఈ ఇయర్ ఫస్ట్ హిట్ కొట్టాడు నాని. రాయలసీమలో కత్తి అనే పదం విన్నా కళ్లు మూసుకేనేంత భయస్థుడిగా..ప్రేమించిన అమ్మాయి కోసం వీర ప్రేమికుడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నాని జీవించాడు. పిరికివాడుగా నాని కడుపుబ్బా నవ్విస్తూనే..ఎమోషనల్ సీన్లతో ఏడిపించాడు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి..కాని ఆ సినిమాలు అన్ని సీరియస్‌గా సాగాయి..కాని ఈ గాథలో మాత్రం ప్రేమచాటున ఫ్యాక్షనిజం తెరమరుగైంది..మెహ్రీన్ కౌర్ అందాలు, విశాల్ చంద్రశేఖర్ మ్యూజీక్అందుకే కృష్ణగాడికి జనం నీరాజనాలు పట్టారు.
టైటిల్ : జెంటిల్‌మెన్
స్టార్ కాస్ట్ : నాని, నివేదా థామస్, సురభి..
డైరెక్టర్ : ఇంద్రగంటి మోహనకృష్ణ
విడుదల తేది : జూన్ 17, 2016

అన్ని లవ్‌స్టోరీస్ చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని భావించిన నాని విభిన్నంగా ఆలోచించాడు. తనను వెండితెరకు పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో జెంటిల్మెన్‌గా వచ్చాడు..ఇందులో గౌతమ్‌గా, జైగా రెండు రకాల పాత్రలు పోషించాడు నాని. ఇతను ఒకడా, ఇద్దరా..? ఒక్కడే అయితే విలనా, హీరోనా అంటూ కన్‌ఫ్యూజ్ చేసి ఆకట్టుకున్నాడు నేచురల్ స్టార్. అయితే మాస్ మసాలాలు, లేదంటే ఫ్యామిలీ డ్రామాలు మినహా కొత్తదనం కరువైపోతున్న టైంలో నాని జెంటిల్మెన్ ప్రేక్షకులను రిఫ్రెష్ చేసిందని చెప్పవచ్చు.
టైటిల్ : మజ్ను
స్టార్ కాస్ట్ : నాని, అను ఇమన్యుయేల్, ప్రియాశ్రీ
డైరెక్టర్ : విరించి వర్మ
విడుదల తేది : సెప్టెంబర్ 23, 2016
.jpg)
ఇయర్ ఫస్టాఫ్‌లో హాఫ్ లవ్‌స్టోరీ..సెకండాఫ్‌లో హాఫ్ లవ్ స్టోరీ సినిమాలు చూపించిన నాని..ఈ సారి మాత్రం ఫుల్ లెంగ్త్ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరు ప్రేమించుకుని విడిపోవడం, కానీ మళ్లీ కలుద్దామనుకునే సమయంలో పరిస్థితులు అనుకూలించకపోవడం అనే కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిలకు దగ్గరై ఇద్దరిని వదులుకునే సన్నివేశంలో నాని జీవించాడు. అయితే మజ్నులో కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్‌మెన్‌లలో ఉన్నంత కంటెంట్ లేదు. కానీ ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్లిపోయింది అంటే కారణం నాని. మొత్తం సినిమాను తన భుజాలపై మోశాడు నాని..అతడికి తోడుగా పీస్‌ఫుల్ మ్యూజిక్, అద్భుతమైన కెమెరా వర్క్ కారణంగా సినిమా చాలా హాయిగా వెళ్లిపోయింది.
![]() |
![]() |