![]() |
![]() |

తెలుగు సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉందని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. తెలుగులో ఏవరేజ్‌గా ఆడిన సినిమాలు సైతం హిందీలోకి డబ్ అయి యూ ట్యూబ్‌లో ఘన సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు ఓ తెలుగు సినిమా హిందీలో హల్‌చల్ చేస్తోంది. అశ్విన్‌బాబు హీరోగా, నందితా శ్వేత హీరోయిన్‌గా నటించిన ‘హిడింబ’ చిత్రం గత సంవత్సరం జూలైలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో శ్రీవిఘ్నేష్ సినిమాస్ పతాకంపై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ‘హిడింబ’ చిత్రాన్ని రెండు వారాల క్రితం హిందీలోకి డబ్ అయిన వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా 30 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన అశ్విన్‌బాబు.. ప్రముఖ యాంకర్, రియాలిటీ షోస్ హోస్ట్ అయిన ఓంకార్ సోదరుడు అనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా అశ్విన్‌బాబు నటించాడు. అయితే ‘హిడిరబ’ మాత్రం హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించడం విశేషంగానే చెప్పుకోవచ్చు.
![]() |
![]() |