![]() |
![]() |

రకుల్ ప్రీత్ సింగ్... అతి తక్కువ కాలంలోనే దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన అగ్రహీరోలందరి సరసన నటించి తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో తన హవా కొనసాగుతున్నప్పుడే హఠాత్తుగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ అక్కడ పెద్దగా తన ప్రభావాన్ని చూపించలేక పోయింది.లేటెస్ట్ గా రకుల్ పెళ్ళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో షికార్లు చేస్తుంది.
రకుల్ అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ తో ఆమె వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 22న గోవాలో అత్యంత వైభవంగా జరిగే ఆ వివాహ వేడుకకి ఇరువైపుల కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవనున్నారు. రకుల్, జాకీ లు గత రెండున్నరేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. తాము డేటింగ్ లో ఉన్నామనే విషయాన్నీ స్వయంగా వాళ్లిద్దరే బహిర్గతం చేసారు. ఆ తర్వాత ఇద్దరు పబ్లిక్‌గా చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో పాటు తమ ఇద్దరికీ సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తు వచ్చారు. అలాగే ఇటీవల జాకీ భగ్నానీ పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ జాకీ కి విషెస్ చెప్తు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియతమా ఈ పుట్టినరోజు నుంచి ప్రతిరోజూ మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కాలని కోరుకుంటున్నాను అలాగే మీలా దయాగుణం అమాయకత్వం కలిగిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. మీరు వేసే జోకులు చాలా సిల్లీగా ఉంటాయి కానీ అవి చాలా సరదాగా ఉంటాయి. మీలాంటి మగవాళ్లను మళ్లీ పుట్టించలేరు. ఎప్పుడూ మనిద్దరం కలిసి అడ్వెంచర్లు, ప్రయాణాలు చేయాలి అంటు రకుల్ చేసిన ట్వీట్ ఒకటి సంచలనం సృష్టించింది.

రకుల్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 తో పాటు శివ కార్తికేయన్ అయలాన్ లోను చేస్తుంటే జాకీ భగ్నానీ బడే మియా చోటే మియా మూవీ విడుదల పనిలో ఉన్నాడు. ప్రస్తుతం రకుల్,జాకీలు థాయిలాండ్ లో బ్యాచ్‌లర్ పార్టీని జరుపుకుంటూ అక్కడే ఉన్నారు.
![]() |
![]() |