![]() |
![]() |

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దేవర’ షూటింగ్‌కు ఇటీవల విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి జపాన్‌కు వెకేషన్ వెళ్లారు. భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు కుమారులు అభయ్, భార్గవ్‌లతో కలిసి అక్కడికి వెళ్లారు. సమయం చిక్కినప్పుడల్లా తన కుటుంబంతో కలిసి ఇలా వెకేషన్‌కి వెళ్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను అక్కడే జరుపుకోవాలని నిర్ణయించుకోవడంతో ఫ్యామిలీతో కలిసి డిసెంబర్ చివరలో వెళ్లారు. జపాన్‌లో తీవ్రస్థాయిలో పలు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ భూకంపాలు సంభవించిన కొన్ని గంటల తర్వాత ఆయన ఇండియాకు బయల్దేరారు. జపాన్ భూకంపాల పట్ల ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
దీనిపై ట్విట్టర్‌లో ఎన్టీఆర్ స్పందిస్తూ ‘జపాన్ నుంచి ఈరోజు ఇంటికి తిరిగొచ్చాను. తీవ్ర భూప్రకంపాలు సంభవించడం షాక్‌కు గురిచేసింది. గత వారం అంతా అక్కడే గడిపాను. భూకంప ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. స్టే స్ట్రాంగ్ జపాన్’ అని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్‌తోపాటు దర్శకుడు రాజమౌళి కూడా స్పందిస్తూ ‘జపాన్‌లో వచ్చిన భూకంపాలు నన్ను షాక్‌కి గురి చేశాయి. ఎంతో మంది దీనివల్ల నష్టపోయారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. జపాన్ త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
జపాన్‌లో మన సౌత్ స్టార్స్‌కి వున్న క్రేజ్ గురించి తెలిసిందే. సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి జపాన్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. రజిని నటించిన చాలా సినిమాలు జపాన్‌లో రిలీజ్ అవుతుంటాయి. ఆమధ్య బాహుబలి జపాన్‌లో విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కూడా జపాన్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం టీవీ ఛానల్స్‌లో, ఓటీటీలో మాత్రమే కనిపిస్తోంది. కానీ, జపాన్ ప్రేక్షకులు మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ను వదిలిపెట్టడం లేదు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 5న ‘ఆర్‌ఆర్‌ఆర్’ జపాన్‌లో రీరిలీజ్ కాబోతోంది. దీన్ని బట్టి మన సినిమాలను, మన తారలను జపాన్ వారు ఎంత గౌరవిస్తారో అర్థం చేసుకోవచ్చు.
![]() |
![]() |