![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో బాలయ్య, బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.
బాలయ్య సినిమాలో విలన్ రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బాలయ్యకి, విలన్ కి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ గానీ, డైలాగ్స్ గానీ అదిరిపోతాయి. ఇప్పుడు 'NBK 109' చిత్రం అంతకుమించి అనేలా ఉండబోతుందట. హీరో, విలన్ మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరూ పోటాపోటీగా తలపడతారట. పవర్ ఫుల్ డైలాగ్ లు గానీ, ఎత్తుకు పైఎత్తు వేసే సన్నివేశాలు గానీ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటాయట. హీరో, విలన్ ఎదురుపడే ప్రతి సన్నివేశం.. థియేటర్లలో అభిమానులను ఊగిపోయేలా చేయడం ఖాయమని చెబుతున్నారు.

'యానిమల్' మూవీలో ఒక్క డైలాగ్ కూడా లేకుండానే కేవలం తన ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు బాబీ డియోల్. అలాంటిది బాలయ్య సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్. దానికి తోడు బాలయ్యను ఢీ కొట్టే అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ అంటే.. బాబీ డియోల్ నటవిశ్వరూపం చూపిస్తాడు అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |