![]() |
![]() |

'అలియాస్ జానకి' సినిమాతో కథానాయికగా పరిచయమైన విశాఖ అమ్మాయి అనీషా అంబ్రోస్. గత ఏడాది మేలో హైదరాబాద్‌లో ఒక ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గుణను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అనీషా అంబ్రోస్ ఐదు నెలల గర్భవతి. నిజం చెప్పాలంటే... ఈ వార్తను ఆమె రహస్యంగా ఉంచాలని అనుకున్నారు. అయితే... నటి తేజస్వి మదివాడ బయట పెట్టేశారు.
అనీషా ప్రయివేట్ సోషల్ మీడియాలో తన బేబీ బంప్‌ని భర్త గుణ ముద్దాడుతున్న ఫొటో పోస్ట్ చేస్తే... దాన్ని అందరికీ తెలిసేలా తేజస్వి చెప్పారు. ఆగస్టులో డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చారని అనీషా అంబ్రోస్ తెలిపారు. తన పుట్టినరోజు కూడా ఆగస్టు నెలలో కావడంతో చాలా ఎగ్జయిట్ అవుతున్నానని ఆమె మురిసిపోయారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో భర్త తనతో ఉండడంతో చాలా సంతోషంగా ఉన్నాననీ, ఇంకా తామిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నామని ఆమె అన్నారు.
'అలియాస్ జానకి' తర్వాత 'పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు', 'రన్', 'మనమంతా', 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్', 'ఈ నగరానికి ఏమైంది?', 'సెవెన్' సినిమాల్లో నటించారు. 'గోపాల గోపాల', 'వున్నది ఒకటే జిందగీ'లో అతిథి పాత్రలు చేశారు. కథానాయికగా అనుకున్నంతగా సక్సెస్ రాలేదు.
![]() |
![]() |