![]() |
![]() |

మలయాళం హిట్ సినిమా అయ్యప్పయుమ్ కోషియుమ్ మూవీ తెలుగులో రీమేక్ కానున్న విషయం మనకు తెలుసు. 'ప్రేమమ్', 'జెర్సీ', 'భీష్మ' సినిమాలతో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ రీమేక్‌కు ప్లాన్ చేస్తోంది. మలయాళంలో బిజూ మీనన్ చేసిన పోలీసాఫీసర్ క్యారెక్టర్ కోసం బాలకృష్ణను, పృథ్వీరాజ్ చేసిన రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ రోల్ కోసం రానా దగ్గుబాటిని నిర్మాతలు సంప్రదించగా, ఆ ఇద్దరూ ఓకే చేసినట్లు ఇదివరకు ప్రచారం జరిగింది.
అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం తనకు వచ్చిన ఆఫర్‌ను బాలకృష్ణ తిరస్కరించారు. ఆయన ఎందుకు ఆ అవకాశాన్ని కాదనుకున్నారనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. దాంతో ఆ క్యారెక్టర్ చేయగల మరో సీనియర్ హీరో కోసం నిర్మాతలు అన్వేషిస్తున్నారు. నాగార్జున లేదా వెంకటేశ్ లేదా రాజశేఖర్‌లలో ఎవరైనా ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేయగలరని భావిస్తున్నారు. చివరకు ఎవరు ఆ క్యారెక్టర్ చేస్తారో చూడాలి. మరోవైపు హవల్దార్ రోల్ చేయడానికి రానా అంగీకరించాడు. నాగార్జున-రానా లేదా వెంకటేశ్-రానా కాంబినేషన్‌లో ఏదైనా ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తుందని చెప్పాలి.
![]() |
![]() |