![]() |
![]() |

ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజాకు అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఇవ్వమని తమిళ చలనచిత్ర ప్రముఖులు పలువురు కోరుతున్నారు. కోరడమే కాదు... కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ఓ లేఖ రాశారు. అందులో నేషనల్ అవార్డ్స్ అందుకున్న ప్రముఖులు 40 మంది సంతకాలు చేశారు. లోక నాయకుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం, తమిళం సహా హిందీ సినిమాలు తీసిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, విలక్షణ చిత్రాల దర్శకుడు బాలా తదితరులు లేఖ రాసిన ప్రముఖులలో ఉండటం గమనార్హం.
ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు భారతీరాజా పేరును కేంద్ర ప్రభుత్వానికి తమిళ సినిమా ప్రముఖులు విన్నవించుకున్నారు. నలభై మూడేళ్లుగా భారతీయ సినిమాకు భారతీరాజా బోల్డంత సేవ చేశారని గుర్తు చేశారు. పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ చేశారని చెప్పారు. లివింగ్ లెజెండ్ భారతీరాజాకు ఫాల్కే అవార్డు ఇచ్చి గౌరవించమని కోరారు.
![]() |
![]() |