![]() |
![]() |

'భీష్మ' మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ వచ్చిన హీరో నితిన్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. జూలై 26న హైదరాబాద్‌లో రాత్రి 8:30 గంటలకు తన దీర్ఘకాల ప్రేయసి షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలవారు, సన్నిహిత స్నేహితులు హాజరవనున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని పసుపు కుంకుమ వేడుక జరిగిన విషయం తెలిసిందే. నిజానికి ఏప్రిల్ 15, 16 తేదీలలో దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని నితిన్ ఆశించాడు. కానీ కరోనా వ్యాప్తి కారణంగా దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దలు జూలై 26న ముహూర్తం నిర్ణయించారు.
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నితిన్ 'రంగ్ దే', 'చెక్' అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాధున్' రీమేక్, కృష్ణచైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' సినిమాలు చేయనున్నాడు.
![]() |
![]() |