![]() |
![]() |

ఈ మాట చెప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె స్వయంగా ఆయనతో 'బాహుబలి' మూవీలో పనిచేసింది కాబట్టి.. ఆ అనుభవంతో ఆమె చెప్పింది. 'బాహుబలి' ఫస్ట్ పార్ట్‌లో అవంతిక పాత్రలో అప్పటివరకూ కనిపించని వారియర్ రోల్‌లో ఆమె మనకు కనిపించింది (సెకండ్ పార్ట్‌లో ఆమె క్యారెక్టర్ పరిధి చాలా తక్కువ). అదే సమయంలో ఏంజెల్‌గానూ ఆమె ఓ పాటలో, కొన్ని షాట్స్‌లో మనకు కనిపించి అలరించింది. 'బాహుబలి' సినిమా తన కెరీర్‌కు పునఃప్రారంభాన్నిచ్చిందనేది తమన్నా అభిప్రాయం. ఆ సినిమాలో ఆమె కత్తి యుద్ధాలు, బాణ ప్రయోగాలు చేసింది. కెరీర్‌లోనే తొలిసారిగా రోప్ షాట్స్ చేసింది.
'బాహుబలి' రిలీజయ్యే దాకా ఆ సినిమా ఎలా ఉంటుందో, తన పాత్ర ఎలా కనిపిస్తుందో తమన్నాకు తెలీదంటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ అది నిజం. "రిలీజయ్యేదాకా 'బాహుబలి' ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఎందుకంటే ఇందులో వీఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండటం వల్ల. రాజమౌళి గారి విజన్ మన ఇమాజినేషన్‌కు అందదు. అవంతిక పాత్రను రాజమౌళి గారి సూచనలు పాటిస్తూ చేశానంతే. 'బాహుబలి' రిలీజయ్యాక నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మరచిపోలేను" అని తెలిపింది తమన్నా.
'అంధాధున్' తెలుగు రీమేక్‌లో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను చేయనుండటం గమనార్హం. ఒరిజినల్‌లో టబు చేసిన పాత్రను ఆయన చేయబోతోంది. వివాహేతర సంబంధం పెట్టుకొని, అతనితో కలిసి భర్తను హత్యచేసే పాత్ర అది. అలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేయనుండటం ఆమెకిదే తొలిసారి. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తున్నాడు.
![]() |
![]() |