![]() |
![]() |

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. ఈ వార్త ఆమె వీరాభిమానులు కొందరికి బాధ కలిగించినా... చాలా మంది తమ అభిమాన తార పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినందుకు సంతోషించారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు చాలామంది గౌతమ్ కాజల్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికంటే అనుష్క అలియాస్ స్వీటీ శెట్టి చెప్పిన శుభాకాంక్షలు ప్రత్యేకమని చెప్పాలి.
"ఈ భూప్రపంచం మీద అన్నిటికంటే మిక్కిలి సంతోషకరమైన ఏదైనా ఉందంటే అది పెళ్లి ద్వారా వచ్చే సంతోషమే. మనసులు రెండు కానీ ఒకటే ఆలోచన... రెండు హృదయాలు కానీ ఒకటే స్పందన... గౌతమ్ కాజల్ దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇద్దరికీ కంగ్రాచ్యులేషన్స్" అని సోషల్ మీడియాలో అనుష్క పోస్ట్ చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లక్షలమంది ఆమె పోస్ట్ ను లైక్ చేశారు.
కాజల్ పెళ్లి చేసుకున్నందుకు అనుష్క శుభాకాంక్షలు చెబితే... కొంతమంది 'మరి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు?' అని కామెంట్ సెక్షన్ లో ప్రశ్నించడం గమనార్హం.
![]() |
![]() |