![]() |
![]() |

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డికి సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఫుల్ పాపులారిటీ ఉంది..అలాగే కళలంటే ఆయనకు ఎంతో పిచ్చి..టీవీల్లో, సినిమాల్లో బాగా పనిచేసే వారికి స్వయంగా తన పేరుతో అవార్డు ఇవ్వడం సన్మానాలు, సత్కారాలు ఏర్పాటు చేయడం ఆయనకు అలవాటు. తాజాగా తొమ్మిది సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్.150గా వచ్చి సూపర్‌హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. అంతే వెంటనే చిరంజీవికి చిత్ర యూనిట్‌కి భారీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సుబ్బిరామిరెడ్డి. అలాగే మరో పెద్ద హీరో నందమూరి బాలకృష్ణ కూడా గౌతమీపుత్ర శాతకర్ణిగా వచ్చి ప్రశంసలతో పాటు కలెక్షన్లను కొల్లగొడుతున్నారు.. మరి చిరంజీవికి ఇచ్చి బాలకృష్ణకు ఇవ్వకపోతే తేడా కొట్టేస్తుందనుకున్నారో ఏమోకానీ వెంటనే బాలయ్యకు కూడా సన్మాన కార్యక్రమం పెట్టించేశారు. ఈ ఈవెంట్‌కి బాలయ్య సతీమణి వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మాణీ, తేజస్విని హాజరయ్యారు.

![]() |
![]() |