![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లో బంధుప్రీతి కారణమని పలువురు సినీ ప్రముఖులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు చేస్తున్న నటీనటులకు నెటిజన్లలో కొందరి నుండి మద్దతు లభిస్తోంది. సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండ్‌వాలే, ప్రస్తుతం అతడితో ప్రేమలో ఉన్న రియా చక్రవర్తి, అతడితో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నదని ప్రచారం జరిగిన కృతి సనన్ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించలేదని కొందరు వాళ్లను ట్రోల్ చేశారు.
ట్రోల్స్ చేస్తున్న సోషల్ మీడియా జనాలపై సోనమ్ కపూర్ మండిపడ్డారు. ఒకరి మరణానికి గాళ్ ఫ్రెండ్, ఎక్స్ గాళ్ ఫ్రెండ్, ఫ్యామిలీ, కొలీగ్స్ ని బ్లేమ్ చేయడం అమాయకులు చేసే పని అంటూ రాయలేని ఒక బూతు పదం ఉపయోగించి తిట్టారు. సోనాక్షి సిన్హా సైతం ఈ ట్రోల్స్ మీద స్పందించారు. పరోక్షంగా కంగనా రనౌత్ మీద ఆమె మండిపడ్డారు. పందులతో తలపెడితే మనకి బురద అంటుకుంటుంది కానీ పందులు ఎంజాయ్ చేస్తాయని సోనాక్షి సిన్హా అన్నారు. అలాగే, మనలో ఒకరు మరణిస్తే కొంతమంది పబ్లిసిటీ పొందాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మాట కంగనాను ఉద్దేశించే అనేది కొందరి అంటున్నారు. అయితే, వీళ్లిద్దరూ వారసరాళ్లుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. దాంతో నెటిజన్లు వీళ్లపై ఎటాక్ చేయడం స్టార్ట్ చేశారు.
"సోనమ్... మీరు 12 సినిమాలు చేస్తే 10 అవార్డులు వచ్చినట్టు ఉన్నాయి. 'నీర్జా'కి తప్ప ఇతర సినిమాలకు మీకు అవార్డులు పొందే అర్హత లేదు" అని ఒకరు కామెంట్ చేశారు. "గాళ్ ఫ్రెండ్స్ ని ఎవరు బ్లేమ్ చేయడం లేదు. బంధుప్రీతిని విమర్శిస్తున్నారు" అని మరొకరు సోనమ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. స్టార్ కిడ్ సోనమ్ సూక్తులు చెబుతుందని కొందరు విమర్శించారు. సోనాక్షి సిన్హా సైతం ఇటువంటి విమర్శలు ఎదుర్కొంటోంది. సుశాంత్ మరణం తర్వాత చాలామంది స్టార్ కిడ్స్ ఇటువంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
![]() |
![]() |