![]() |
![]() |

ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బాలీవుడ్ నటి అంకిత లోఖండే ఆరేళ్లు డేటింగ్ లో ఉన్నారు. బాలీవుడ్ సీరియల్ 'పవిత్ర రిష్తా'లో వీళ్లిద్దరు కలిసి నటించారు. అప్పట్లో ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల డేటింగ్ తర్వాత 2016లో విడిపోయారు. అయినప్పటికీ సుశాంత్ అంటే అంకితకు గౌరవం ఉంది. అతడి మరణవార్త విని ఆమె కన్నీరు మున్నీరు అయిందని సన్నిహితులు తెలిపారు. కడసారి సుశాంత్ ను చూడడానికి వెళ్దామని అనుకున్నప్పటికీ... భావోద్వేగాలను అదుపు చేసుకో లేని కారణంగా అంకిత లోఖండే వెళ్లలేదని వారు పేర్కొన్నారు. చివరకు మంగళవారం ముంబైలోని బాంద్రాలో గల సుశాంత్ ఫ్లాట్ కు ఆమె వెళ్లారు. అతడి తల్లిదండ్రులు పరామర్శించి వచ్చారు. అక్కడి నుంచి వెళ్తున్న సమయంలోనూ ఆమె తన్నీరు పెట్టుకున్నారని చూసిన వారు చెబుతున్నారు.
అంకితతో బ్రేకప్ తర్వాత చక్రవర్తితో సుశాంత్ ప్రేమలో పడ్డాడు. ఆమె మరొకరితో ప్రేమలో పడింది. అయితే, సుశాంత్ అంటే ఎంతో గౌరవమని, ఆరేళ్ల బంధానికి చాలా విలువ ఇస్తుందని అంకిత స్నేహితులు తెలియజేశారు. సుశాంత్ మరణం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి.
![]() |
![]() |