![]() |
![]() |

ఒక హీరో సినిమాకి నెగటివ్ టాక్ వస్తే మరో హీరో అభిమానులు పండగ చేసుకోవడం చూస్తుంటాం. అయితే ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ సినిమాకి పాజిటివ్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
సలార్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ప్రధాన కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నీల్ తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తోనే చేయబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర'లో నటిస్తున్న తారక్.. ఆ తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు.
ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ అని గతంలో నీల్ చెప్పాడు. అలాగే తన గత చిత్రాలకు భిన్నంగా, చాలా కొత్తగా ఉంటుందని కూడా నీల్ తెలిపాడు. దీంతో ఇంకా ప్రారంభం కాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు తారక్ ఫ్యాన్స్. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ని.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మరో స్థాయికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే 'సలార్'కి పాజిటివ్ టాక్ వస్తే తారక్ అభిమానులు ఆనందపడుతున్నారు.
'సలార్'లో హీరో ఎలివేషన్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అలాంటి ఎలివేషన్ సీన్స్ లో ఎన్టీఆర్ ని చూసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కి మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తాడు. 'కేజీఎఫ్' తరహాలోనే 'సలార్'లో కూడా హీరో ఎలివేషన్స్ హైలైట్ గా నిలిచాయని టాక్ రావడంతో.. నెక్స్ట్ తమ హీరోని కూడా అదే రేంజ్ లో చూపిస్తాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
![]() |
![]() |