![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన 'సలార్' మూవీ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా నేడు(డిసెంబర్ 22న) విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఫైట్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ మెప్పిస్తున్నాయి అంటున్నారు. తమ అభిమాన హీరోని దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన తీరుకి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో అప్పుడే 'సలార్' ఓటీటీ అప్డేట్ కి సంబంధించిన చర్చ నడుస్తోంది. సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ పార్టనర్ నెట్ ఫ్లిక్స్ అంటూ టైటిల్ కార్డ్స్ లో అధికారికంగా రివీల్ చేశారు. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
![]() |
![]() |