![]() |
![]() |

ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా మే నెలలో రిలీజ్ అయిన చిత్రం 2018 . గ్రిప్పింగ్ సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అలాగే పలు అవార్డులని సైతం 2018 పొందింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఆ చిత్ర యూనిట్ కీ షాక్ ఇచ్చింది.
కొన్ని రోజుల క్రితం 2018 చిత్రాన్ని మేకర్స్ 96 వ అకాడమీ అవార్డుల కోసం పంపారు. అందులో భాగంగా ఆస్కార్ కమిటీ ఆస్కార్ కి అర్హత సాధించే సినిమాలని షార్ట్ లిస్ట్ చేసారు. ఇందులో భాగంగా 2018 మూవీ బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ లో షార్ట్ లిస్ట్ కాలేదు. దీంతో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 2018 అవార్డు ని గెలుచుకుంటుందని భావించిన వాళ్ళందరు నిరుత్సాహపడుతున్నారు.

ఈ మూవీలో టోవినో థామస్ ,అసిఫ్ అలీ, నరేన్, అపర్ణ బాలమురళి, కళాయిరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో నటించారు. జేడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని వేణు కున్నప్పిల్లి, సికె పద్మ కుమార్ మరియు ఆంటో జోసెఫ్ లు నిర్మించారు. నోబిన్ పాల్ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |