![]() |
![]() |

టాలీవుడ్ క్రేజీ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది శ్రీముఖి. తనదైన మార్కు అల్లరితో బుల్లి తెరపై సందడి చేసే ఈ రాములమ్మ లాక్‌డౌన్.. ఆ తరువాత టైట్ షెడ్యూల్ కారణంగా బిజీ బిజీగా గడిపేసింది. వరుస టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడిపేసిన శ్రీముఖి గత రెండు రోజుల క్రితం క్రితం చిన్న బ్రేక్ కోసం గోవా వెళ్లింది. అక్కడి బీచ్‌లో విహరిస్తూ అల్లరి చేస్తూ హంగామా సృష్టిస్తోంది.
.jpg)
ఒక్కపారిగా చిన్న పిల్లలా మారిపోయి బీచ్ అందాలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. తొలి రోజు గులాబీ కలర్ చిట్టిపొట్టి గౌనులో దర్శనమిచ్చి రచ్చ చేసిన శ్రీముఖి మూడవ రోజైన శనివారం సాగర కన్యగా వాటర్ బేబీగా మారిపోయి మారాం చేసింది.
.jpg)
ఒక్కసారిగా ఆకాశంలో విహరిస్తూ ఆనందాల హద్దుల్ని చెరిపేస్తూ ఫ్రీ బర్డ్‌లా మారి జలకాలాడింది. తన సన్నిహితులతో కలిసి విహరిస్తూ ఒక్క సారిగా లోకం మరిచి ఆనందతాండవం చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
.jpg)
తన గోవా ట్రిప్‌కి సంబంధించిన ఫొటోలని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుని మురిసిపోయింది. ఫొటోషూట్‌లకు మించి అందాల్ని ఆరబోస్తూ శ్రీముఖి చేసిన హంగామా.. ఆమె అందాలకి శ్రీముఖి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
.jpg)
గోవాలో మూడవ రోజు. వాటర్ బేబీ, తిరిగి రావడం ఇష్టం లేదు` అంటూ పోస్ట్ చేసింది శ్రీముఖి. తడిపొడి డ్రెస్సుల్లో శ్రీముఖి అందాల విందు చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
.jpg)
.jpg)
![]() |
![]() |