![]() |
![]() |

స్టార్ హీరో 'సూర్య'(Suriya)స్క్రీన్ పైనే కాకుండా, నిజజీవితంలోను హీరోగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు నిదర్శనమే 'అగరం ఫౌండేషన్'(Agaram Foundation).2006 లో ఈ ఫౌండేషన్ ని స్థాపించాడు. నిరుపేద విద్యార్థులకి ఉన్నత విద్య, వసతిని అందించడంతో పాటు, తమిళనాడులోని గ్రామీణ సమాజం యొక్క సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం మరియు సహాయం చేయడమే అగరం ఫౌండేషన్ లక్ష్యం. ప్రత్యేకించి మహిళా విద్యార్థులకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. దీంతో సూర్య దగ్గర చాలా మంది పని మనుషులు పని చేస్తుంటారు.
ఈ కోవలోనే సూర్య దగ్గర సులోచన, ఆమె కుమారుడు ఎంతో నమ్మకంతో పని చేస్తు వస్తున్నారు. సూర్య కి భద్రత అధికారిగా జార్జ్ ప్రభు కూడా పని చేస్తున్నాడు. సులోచన ఆమె కొడుకు కలిసి జార్జ్ కి అధిక వడ్డీ ఆశ చూపించి లక్ష రూపాయలని తీసుకున్నాడు. అందుకు గాను అధిక వడ్డీ కింద, కొంత బంగారాన్ని ఇచ్చారు. దీంతో నమ్మకం కుదరడంతో జార్జ్ ఆ ఇద్దరికి విడతల వారీగా 42 లక్షల రూపాయలు ఇచ్చాడు. కానీ చెల్లింపు విషయంలో లేటు చేసే సరికి గట్టిగా అడిగాడు. దీంతో ఆ ఇద్దరు సూర్య ఇంటి నుంచి పారిపోయారు. జార్జ్ పోలీసులుకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులకి విచారణలో విస్తుపోయే నిజాలు తెలిసాయి. సులోచన, ఆమె కొడుకుతో పాటు కుటుంబంలోని మరో ఇద్దరు ముఠాగా ఏర్పడి, చెన్నైలోని పలువుర్ని మోసం చేసి, రెండు కోట్ల రూపాయల వరకు మోసం చేసారని గుర్తించారు. ఆ ఇద్దరు కూడా సూర్య ఇంట్లో పని చేసేవారే కావడం గమనార్హం.
సినిమాల పరంగా చూసుకుంటే కంగువా, రెట్రో తో వరుస పరాజయాల్ని అందుకొని,తన అభిమానులని నిరాశపరిచాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో,ఆర్ జె బాలాజీ(RJ Balaji)దర్వకత్వంలో 'కరుప్పు' అనే మూవీ చేస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తన అభిమానులని తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం సూర్యలో ఉంది. వెంకీ అట్లూరి(Venki Atluri)దర్శకత్వంలో 'సితార ఎంటర్ టైన్ మెంట్' నిర్మిస్తుండగా, షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.
![]() |
![]() |