![]() |
![]() |
షార్ట్ ఫిలింస్ ద్వారా కెరీర్ ప్రారంభించిన చాందిని.. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. కుందనపుబొమ్మ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై కలర్‌ఫోటో, గామీ, యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
చాందినికి ఒకసారి ఓ వింత అనుభవం ఎదురైంది. ఒక కొత్త నెంబర్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘నువ్వు గెస్ట్ హౌస్‌కి రావాలి. లేకుంటే నీ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తా’ అని ఆ మెసేజ్‌లో ఉంది. అది చూసి ఎంతో టెన్షన్ పడిపోయిన చాందిని తెగ ఏడ్చిందట. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే.. టాలీవుడ్‌లో టామ్ బాయ్‌గా చెప్పుకునే స్నిగ్ధ.. సరదాగా చాందినిని ఆట పట్టించడానికి అలా మెసేజ్ చేసింది. ‘మీరెప్పుడైనా దూల పని చేశారా?’ అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ స్టోరీ చెప్పుకొచ్చింది స్నిగ్ధ. అయితే తర్వాత తనే సరదాగా అలా మెసేజ్ చేసానని చాందినికి చెప్పిందట. అది విన్న చాందిని ‘ఎక్కడున్నావ్’ అని అడిగింది. తను ఉన్న ప్లేస్ చెప్పింది స్నిగ్ధ. వెంటనే అక్కడికి వెళ్లిన చాందిని.. ఆమె చెంప ఛెళ్లుమనిపించింది. స్నిగ్ధ సరదాగా ఆ మెసేజ్ చేసినప్పటికీ చాందిని ఎంత టెన్షన్ ఫీల్ అయి ఉంటుందో ఆమె రియాక్షన్ చూస్తే తెలుస్తుంది.
![]() |
![]() |