![]() |
![]() |

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస విజయాలతో 'సందీప్ రెడ్డి వంగ' పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి కొత్త రకం కథల్ని, కథనాల్నిపరిచయం చేసాడనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ కోవలోనే మరోసారి తన సత్తా చాటడానికి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా
కనిపిస్తుండంతో,సందీప్ రెడ్డి ఈ సారి ఎలాంటి కథ చెప్పబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది.
మొదట నుంచి సందీప్ రెడ్డి తాను తెరకెక్కించిన ప్రతి చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు. తన బ్యానర్ పేరు 'భద్రకాళి పిక్చర్స్'. ఇప్పుడు ఈ భద్రకాళి పిక్చర్స్ పై సొంతంగా బయట దర్శకులతో మూవీ చెయ్యడానికి శ్రీకారం చేపట్టాడు. ఈ మూవీలో హీరోయిన్ గా 'అనంతిక సనీల్ కుమార్' ఖరారైనట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. మలయాళ చిత్ర పరిశమ్రకి చెందిన అనంతిక ఇటీవల '8 వసంతాలు'లో ప్రధాన పాత్ర పోషించి తన పెర్ ఫార్మెన్స్ తో కట్టిపడేసింది. శుద్హి అయోధ్య అనే పలు రకాల పార్శ్యాలుతో కూడిన బరువైన క్యారక్టర్ లో, అనంతిక నటించిన తీరుకి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. పైగా కరాటే లో బ్లాక్ బెల్ట్ కూడా. సందీప్ రెడ్డి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. దీంతో అనంతిక చిత్రాన్ని తన ఇమేజ్ కి తగ్గట్టుగా నిర్మించడం గ్యారంటీ. కథ, కథనాల్లో పక్కాగా తన మార్క్ ఉంటుంది. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించబోతున్నాడనే ఆసక్తి అందరిలో మొదలైంది.
ఇక ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఉండబోతుందని, వేణు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. హీరోగా 'మేంఫేమస్' మూవీ ఫేమ్ 'సుమంత్ ప్రభాస్' ఖరారైనట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన రానుందని టాక్.
.webp)
![]() |
![]() |