![]() |
![]() |

టాలీవుడ్ దర్శకులు కరోనాకి థాంక్యూ చెప్పాలేమో! కరోనా వల్ల అనుకోకుండా థియేటర్ల డోర్లు మూసుకు పోవడంతో వాళ్లకు డిజిటల్ మీడియమ్ డోర్లు తెరుచుకున్నాయి. ఓటీటీ వేదికల నుండి ఆఫర్లు రావడంతో ఖాళీ సమయంలో వెబ్ సిరీస్‌ల మీద దృష్టి పెడుతున్నారు. క్రిష్, నందినీరెడ్డి, 'పలాస' ఫేమ్ కరుణకుమార్ తదితరులు ఓటీటీ బాట పట్టారు. లేటెస్టుగా సీనియర్ దర్శకుడు వీఎన్ ఆదిత్య కూడా వెబ్ సిరీస్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.
'మనసంతా నువ్వే', 'నేనున్నాను' సినిమాలకు దర్శకత్వం వహించిన వీఎన్ ఆదిత్య ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ వర్క్ చేస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. త్వరలో ప్రకటన వస్తుందని టాక్. ఇందులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటిస్తారని సమాచారం. కామెడీ హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తరవాత డిఫరెంట్ క్యారెక్టర్లలో ఆయన నటిస్తున్నారు. ఇందులో క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందట. ఇప్పటివరకు ఆయన వెబ్ సిరీస్ చేయలేదు. ఇందులో చేస్తారో లేదో చూడాలి.
![]() |
![]() |