![]() |
![]() |

స్టార్ మా ఛానల్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 4లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటాయని తెలుగువన్ ముందే తెలియజేసిన సంగతి తెలిసిందే. షో రన్ చేసే స్టైల్ మారుస్తున్నారని ముందే చెప్పాం. ప్రారంభమైన రోజే ఆ మార్పులు ఏమిటో 'బిగ్ బాస్' చెప్పాడు. ఈసారి బిగ్ బాస్ షో స్టార్టింగ్ లో హైలైట్స్ ఏంటంటే... కింగ్ నాగార్జున డబుల్ రోల్ ఎంట్రీ ఇవ్వడం!
షో ఫార్మాట్ విషయానికి వస్తే... 'బిగ్ బాస్' హౌస్ పక్కన మరో హౌస్ ఏర్పాటు చేయడం! మొత్తం 16 మంది కంటెస్టెంట్ లో ఇద్దరు కంటెస్టెంట్లు సయ్యద్ సోహెల్, హర్యానా ను నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించలేదు. పక్కనే ఉన్న మరో ఇంట్లోకి పంపించారు. ఆ హౌస్ లో ఉంచడం వెనుక స్ట్రాటజీ ఏంటనేది పోను పోను తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ ఇంట్లో స్పెషల్ రూమ్ ఒకటి క్రియేట్ చేశారు. అదే ఎందుకు అనేది కూడా మొదటిరోజు చెప్పలేదు. త్వరలో ఆ స్పెషల్ రూమ్ ఓపెన్ చేస్తారట. అందులో ఏముంటుంది? దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? అనేది కూడా ఆసక్తికరమే. బుల్లితెర ప్రేక్షకుల క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం సరికొత్త ప్రణాళికతో షో నిర్వాహకులు ఉన్నట్లు అర్థమవుతోంది.
![]() |
![]() |