![]() |
![]() |

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలయింది. 'ది ఫ్యామిలీ మ్యాన్'కు కొనసాగింపుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇందులో మొదటి భాగంలో నటించిన మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణిలతో పాటు.. సమంత అక్కినేని కూడా ఒక కీలక పాత్రలో నటించింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే డీ గ్లామర్ అండ్ నెగిటివ్ రోల్ లో సమంత కనిపించబోతోందని అర్థమవుతోంది. ఇది సమంత డెబ్యూ వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 టీమ్ తాజాగా ట్రైలర్ విడుదల చేస్తూ స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్టు పేర్కొన్నారు. ట్రైలర్లో మనోజ్ బాజ్‌పాయ్ జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్ సెల్లో పని చేసే శ్రీకాంత్ అనే ఓ మధ్యతరగతి వ్యక్తి పాత్రలో కనిపించాడు. ఆఫీసులో ఏ పని చేయడని, ఇంట్లోను సరిగా ఉండడని నిందలు ఎదుర్కొనే అతను.. ఉగ్రవాదులను తుద ముట్టించే సీన్లలో మాత్రం ఒక సైనిక వీరుడిగా కనిపిస్తున్నాడు.
మరోవైపు సమంత సూసైడ్ బాంబర్‌గా డీ గ్లామరస్ లుక్‌లో కనిపించింది. వాళ్లను నేనే చంపుతా అంటూ సమంత చెప్పిన డైలాగ్ వెబ్ సిరీస్ఫై మరిన్ని అంచనాలు పెంచింది. ట్రైలర్ లో సమంత పెర్ఫార్మన్స్ చూస్తుంటే ఆమె పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె లుక్ కి, యాక్టింగ్ కి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తన భార్య సమంత పెర్ఫార్మన్స్ గురించి హీరో నాగ చైతన్య స్పందించారు. ట్రైలర్ నచ్చింది, పదికి పది మార్కులు అంటూ చైతన్య ట్వీట్ చేశాడు.
![]() |
![]() |