![]() |
![]() |

శ్రీకాంత్‌కి హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వైపు టర్న్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. శ్రీకాంత్ తో సరిసమానంగా కెరీర్ ప్రారంభించినోళ్లంతా వయసు మీద పడడంతో.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేశారు. శ్రీకాంత్ మాత్రం ఇంకా హీరోయిజం అంటూ.. పలవరిస్తున్నాడు. శ్రీకాంత్ నుంచి వచ్చిన నాటు కోడి ట్రైలర్ చూస్తుంటే.. శ్రీకాంత్ కి ఇంకా హీరోయిజంపై ఆశ చావలేదనిపిస్తోంది. నాని కృష్ణ దర్శకత్వం వహించినచిత్రమిది. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైంది. పడుతూ లేస్తూ ఇప్పటికి షూటింగ్ పూర్తి చేసుకొంది. పాటలూ విడుదలయ్యాయి. ట్రైలర్ చూస్తుంటే మాసీగానే కనిపిస్తోంది. టెంపర్, పటాస్ సినిమాల్ని శ్రీకాంత్ వెర్షన్‌లో చూసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే అవినీతి పరుడైన ఓ పోలీస్ అధికారి కథ ఇది. చివరికి ఎలా మారాడు? దుర్మార్గుల్ని ఎలా అంతం చేశాడన్నదే స్టోరీ. టెంపర్, పటాస్‌లోని స్టోరీలైన్‌కూడా ఇంతే కదా. అయితే వాటికంటే మాస్ మసాలా బాగా దట్టించి ఈ సినిమా రూపొందించారు. శ్రీకాంత్ కూడా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. బడ్జెట్ సహకరించలేదేమో.. మేకింగ్‌లో క్వాలిటీ తగ్గింది. దానికి తోడు శ్రీకాంత్ - నాని కృష్ణ కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన దేవరాయ ఫ్లాప్ అయ్యింది. మరి ఈ నాటుకోడి ఏం చేస్తుందో..??
![]() |
![]() |