![]() |
![]() |

లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఖైదీ నెం.150. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచానాలున్నాయి..ఇప్పటికే విడుదలైన టీజర్‌ను కేవలం 3 గంటల్లోనే మిలియన్ మంది చూశారంటే చిరు రాకకోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమైపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంది..కానీ ఆ ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేసింది ఒక పాట. ఖైదీ నెం.150 పాటలన్నీ డైరెక్ట్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేయనుండటంతో.. ఫ్యాన్స్ కోసమని విడుదల చేసిన కుమ్ముడు సాంగ్ అట్టర్ ఫ్లాపయ్యింది..పాటలో ఏమాత్రం పస లేకపోవడంతో పాటు రోటీన్ ట్యూన్స్, లిరిక్స్‌తో చిరు అభిమానులు నిరాశచెందారు.
పాటే ఇలా ఉంటే సినిమా ఇంకేలా ఉంటుందోనన్న భయం మెగా ఫ్యాన్స్‌ని భయపెడుతోంది. దీనిని గుర్తించిన చిత్రయూనిట్ ట్రబుల్ షూట్ చేయాలని డిసైడ్ అయ్యింది. రషెష చూసిన చిరు..కొన్ని సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డైరెక్టర్ వివి వినాయక్‌తో దగ్గరుండి మరీ రీషూట్ చేయిస్తున్నాడట చిరు. కానీ మెగాస్టార్ సినిమాకు కూడా రీషూట్ ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే పరీక్షల్లో మంచి మార్కులు కోసం బెటర్‌మెంట్ రాసినట్లే..సినిమా సక్సెస్ కోసం రీషూట్ చేయడంలో తప్పేంటి అని మరికొందరు సమర్థిస్తున్నారు.
![]() |
![]() |