![]() |
![]() |
.jpg)
కోటి రూపాయలంటే ఈ రోజుల్లో మామూలు విషయంకాదు. పైగా నోట్ల రద్దుతో వంద రూపాయల నోటు దొరకడమే గగనం అయిపోయింది. సినిమా విషయాలకొస్తే కోటి రూపాయలతో పెళ్లి చూపులు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసేయొచ్చు. అలాంటిది ఒక్క పాటకే కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాడో నిర్మాత. ఇంత ఖరీదైన పాటలో కనిపిస్తోంది స్టార్ హీరోయిన్ కాదు. అది స్టార్ హీరో సినిమా అస్సలు కాదు. అది కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న నక్షత్రం.
సందీప్ కిషన్ కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెజీనా ఓ కథానాయికగా నటిస్తోంది. ఆమెపై కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఓ పాట తెరకెక్కిస్తున్నాడట కృష్ణవంశీ. తన సినిమాల్లో హీరోయిన్లను రొమాంటిక్‌గా చూపించడం కృష్ణవంశీకి అలవాటే. రెజీనాకి కూడా అలానే రొమాంటిక్‌గా చూపించాలని కృష్ణవంశీ ప్రయత్నిస్తున్నాడట. అందుకే భారీ లెవిల్లో ఈ పాటకి ప్లాన్ చేశాడట. ఈ ఒక్క పాటలోనే రెజీనా 15 కాస్ట్యూమ్స్‌ని మార్చబోతోందట. 300 మంది డాన్సర్లు ఈ పాటలో కనిపిస్తారట. మొత్తమ్మీద ఆరొందల మంది ఈ ఒక్క పాటకే పనిచేస్తున్నట్టు టాక్. మరి ఈ పాట ఏ రేంజులో తయారవుతుందో చూడాలి.
![]() |
![]() |