![]() |
![]() |
.jpg)
పవన్-దాసరి కాంభినేషన్..ఇది ఎనౌన్స్ చేయగానే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. దాసరి నారాయణరావు ఇంత అర్జెంటుగా పవన్‌తో సినిమా ఏంటని..అంచనాలు, చర్చలు అబ్బో టాలీవుడ్ పెద్దలంతా ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ లేనట్లే అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే తాను 2019లో జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు పవన్ ప్రకటించారు.
అప్పటి వరకు ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలు చేస్తానన్నారు. ఇప్పటికే డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చేస్తున్న పవన్ దీని తర్వాత నీసన్, త్రివిక్రమ్ మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవి పూర్తిచేయడానికి ఎలా లేదన్నా రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. ఈ లోగా ఎలక్షన్స్ వచ్చేస్తాయి..దీంతో జనసేన అధినేతగా ఫుల్ బిజీ. ఇంత పీక్ టైంలో సినిమాపై ఫోకస్ పెట్టడం చాలా కష్టం.. అంతేకాకుండా అప్పటికి వయసు దృష్ట్యా పవన్, దాసరి ఇద్దరికి అంత ఓపిక ఉండకపోవచ్చు. సో ఇక ఈ మూవీ గురించి మరచిపోవడం మంచిదని ఫిలింనగర్ టాక్.
![]() |
![]() |