![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'సింహా', 'లెజెండ్'.. ఇలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాంటి వీరి కలయికలో ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. 'BB3' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న వేసవిలో సందడి చేయనుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన గత రెండు చిత్రాలు కూడా వేసవిలోనే వినోదాలు పంచాయి. వీరి ఫస్ట్ కాంబో వెంచర్ 'సింహా' 2010లో సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 30న రిలీజ్ కాగా.. సెకండ్ కాంబినేషన్ మూవీ 'లెజెండ్' 2014లో వేసవి కానుకగా మార్చి 28న విడుదలైంది. ఈ రెండు కూడా సంచలనం సృష్టించాయి. మరి.. బాలయ్య, బోయపాటి కాంబో సేమ్ సమ్మర్ స్ట్రాటజీ సెంటిమెంట్ రిపీట్ అయి 'BB3' కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
బాలయ్య సరసన నాయికలుగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
![]() |
![]() |