![]() |
![]() |

సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీ అంటే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. ఒక్క హీరోని స్ర్కీన్ పై చూస్తూనే అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా నలుగురు యంగ్ హీరోలతో 'శమంతకమణి' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ప్రశంసలు కురిపించారు. సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన శమంతకమణి సినిమా ట్రైలర్‌ని చూసి ఆకాశానికెత్తేశారు. ఈమధ్య కాలంలో ఇంత మంచి స్టైలిష్ ట్రైలర్‌ని తాను చూడనేలేదని ట్వీట్ చేశారు. చివరకు థమ్సప్ టు శమంతకమణి, సుధీర్ బాబు అని చెప్పాడు. కాగా ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 14న సినిమా రిలీజ్ కానుంది.
![]() |
![]() |