![]() |
![]() |
.jpg)
బాహుబలి 2 సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా విడుదలై ఇప్పటికీ చాలా రోజులు గడిచిపోయినా ఇంకా ఈ సినిమా గురించిన ప్రస్తావన అప్పుడప్పుడు వస్తూనే ఉంది. ఇక ఈ సినిమాలో నటించిన వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కొక్కరి పాత్ర ఒక్కో అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు రాజమౌళి. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర అయిన కట్టప్ప పాత్ర గురించి మాట్లాడిన బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఈ సినిమా చూసిన బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్, కట్టప్ప పాత్ర తానైతే మరింత బాగా చేసేవాడినన్నాడు. ఆ పాత్ర చేసేందుకు కావాల్సిన ఫిజిక్, మేనరిజమ్స్ నాకు ఉన్నాయని...కట్టప్ప పాత్రకు నేనే మరింత న్యాయం చేయగలనని అన్నాడు. ఆఖరిలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ ను ప్రశంసించాడు. సత్యరాజ్ కూడా చాలా బాగా నటించాడని, ముఖ్యంగా సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా రాజమౌళిదే అన్నాడు.
![]() |
![]() |