![]() |
![]() |

’శమంతమణి‘ అని టైటిల్ పెట్టేసి, సినిమాపై ఆసక్తినీ, అంచనాను పెంచేశాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. యువ హీరోలు నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది ఇందులో హీరోలుగా నటించారు. రిలీజైన టీజర్ ని బట్టి చూస్తే, రాజేంద్రప్రసాద్ పాత్ర కీలకంగా కనిపిస్తోంది. చిన్న పాయింట్ తీసుకొని స్ర్కీన్ ప్లే ప్రధానంగా.. సరదాగా, ఆసక్తి కరంగా యువతరం మెచ్చే కామెడీ థ్రిల్లర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.
జులాయిగా తిరిగే కుర్రాడిగా సందీప్ కిషన్, ఎదైనా మంచి ఖాతా పట్టేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని చూసే కరెప్టడ్ పోలీస్ కాప్ గా నారా రోహిత్, ధనిక వర్గానికి చెందిన కుర్రాళ్లుగా సుధీర్ బాబు, ఆది నటించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే... వీళ్లందరి టార్గెట్ మాత్రం అయిదు కోట్లు ఖరీదు చేసే ’శమంతకమణి‘ అనే ఓ కారు. ఆ కారులో ఏ ముంది అనేదే సినిమా. ’హైదరాబాద్ లో టాప్ హోటల్.. అయిదొందల మది జనం.. అయిదు కోట్లు ఖరీదు చేసే కారు‘ ట్రైలర్లో వినిపిస్తున్న ఈ డైలాగ్ లోనే కథంతా ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్లర్లేదు. నిర్మాత వి.ఆనందప్రసాద్ కూడా ఖర్చుకు వెనకాడకుండా లావిష్ గా సినిమాను నిర్మించినట్లు సమాచారం. ఎడిటింగ్, కెమెరా పనితరం, మణిశర్మ రీరికార్డింగ్ ట్రైలర్ కి హైలైట్. పాత హిందీ క్లాసిక్ సాంగ్ తో మొదలయ్యే ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. మరి ట్రైలర్ లా సినిమా కూడా ఆకట్టుకుంటుందో, లేదో చూడాలి.
![]() |
![]() |