![]() |
![]() |

విభిన్న చిత్రాలు, విభిన్న పాత్రలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా మరో మూవీని ప్రకటించాడు. గతంలో తనతో 'తిమ్మరుసు' అనే సినిమా చేసి ఆకట్టుకున్న డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టితో 'ఫుల్ బాటిల్' అనే మరో మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఎస్డీ కంపెనీ, శర్వంత్ రామ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఫుల్ బాటిల్' మూవీ బుధవారం నాడు హైదరాబాద్ లో లాంచ్ అయింది. అలాగే ఈ సందర్భంగా మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్ ని బట్టి చూస్తే ఇది కాకినాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని అర్థమవుతోంది. పోస్టర్ లో కాకినాడ పోర్ట్ తో పాటు కాకినాడలోని పలు ప్రదేశాలను చూపించారు. అలాగే టైటిల్ డిజైన్ కూడా ఆకట్టుకుంటోంది. ఆటోలో అబ్బాయి అమ్మాయి వెళ్తుండగా.. ఆ ఆటోపైన మద్యం బాటిల్ ఉండి, దానిలో ఫుల్ బాటిల్ అని రాసుంది.

సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి ఎడిటర్ గా సంతోష్ కామిరెడ్డి వర్క్ చేస్తున్నారు.
![]() |
![]() |