![]() |
![]() |

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తీర్చిదిద్దిన RRR మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 పేరిట ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డును సొంతం చేసుకున్న RRR ఇప్పుడు రూ. 250 కోట్ల మార్కును అందుకోవడానికి ఉరకలు వేస్తోంది. మంగళవారం 12వ రోజు ఈ సినిమా రూ. 4.88 కోట్ల షేర్‌ను సాధించింది. 12వ రోజుకు సంబంధించి ఇది రెండో అత్యధిక షేర్. ఇదివరకు బాహుబలి 2 ఇదే రోజు రూ. 5.49 కోట్లను వసూలు చేసింది.
కాగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో RRR వసూళ్లు 12 రోజులకు రూ. 244.36 కోట్లకు చేరుకున్నాయి. గురువారం నాటికి ఈ వసూళ్లు రూ. 250 కోట్ల మార్కును అందుకోవడం తథ్యం. ఇక మంగళవారం విషయానికి వస్తే.. ఆంధ్రలో రూ. 1.96 కోట్లు, తెలంగాణలో రూ. 2.12 కోట్లు, రాయలసీమలో రూ. 80 లక్షల షేర్‌ను సాధించింది RRR.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 191 కోట్లు. ఇప్పటికే రూ. 50 కోట్లకు మించి ఓవర్ ఫ్లో వచ్చింది. అందులో తెలంగాణ వాటానే ఎక్కువ. తర్వాత రాయలసీమ బయ్యర్లకు లాభాలు వచ్చాయి. ఆంధ్రా ఏరియాలోనూ ఒక్క నెల్లూరు ఏరియాను మించి మిగతా ఏరియాల బయ్యర్లు ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి రాజమౌళిని నమ్మి రిస్క్ చేసిన బయ్యర్లంతా ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
![]() |
![]() |