![]() |
![]() |

దర్శక ధీరుడు యస్.యస్. రాజమౌళి తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ పోతున్నాడు. మొదట 'బాహుబలి'తో, తర్వాత 'బాహుబలి2'తో చరిత్ర సృష్టించిన ఆయన.. ఇప్పుడు తన లేటెస్ట్ ఫిల్మ్ RRRతో సరికొత్త రికార్డులను సాధిస్తున్నాడు. ఇప్పటికే తెలుగునాట 'బాహుబలి 2' రికార్డులను తిరగరాసిన RRR, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే రూ. 100 కోట్ల షేర్ సాధించిన మొట్టమొదటి మూవీగా మరో అసాధారణ రికార్డును సొంతం చేసుకుంది.
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా తెలుగునాట సాధిస్తున్న కలెక్షన్లు దేశంలోని ట్రేడ్ వర్గాలను సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయేలా చేస్తున్నాయి. మంగళవారం RRR తెలంగాణలో రూ. 2.12 కోట్ల షేర్‌ను సాధించింది. దీంతో 12 రోజుల్లోనే ఈ ఏరియాలో రూ. 101.36 కోట్ల షేర్‌ను రాబట్టి చరిత్ర సృష్టించింది.
తెలంగాణలో మునుపటి రికార్డు రూ. 68 కోట్లతో 'బాహుబలి 2' పేరిట మీద ఉంది. ఇప్పుడు ఏ రేంజ్‌లో RRR ఆ రికార్డును దాటేసిందో చూస్తే మైండ్ బ్లాక్ అవక మానదు. నిజానికి 'బాహుబలి' కలెక్షన్లను మించి రూ. 70 కోట్లకు దిల్ రాజు RRR మూవీని తెలంగాణ ఏరియాకు కొనుగోలు చేశారు. 'రాధే శ్యామ్' మూవీతో తీవ్రంగా నష్టపోయిన ఆయనకు RRR భారీ ఊరటనిచ్చింది. కొన్నదానికి మించి ఇప్పటికే 44 శాతం ఎక్కువ కలెక్షన్ వచ్చింది. ఈ నెల 14న 'కేజీఎఫ్ 2' రిలీజ్ అయ్యేదాకా మరింత కలెక్షన్ వచ్చే అవకాశం ఉండటం రాజుకు కలిసి వచ్చే అంశం.
![]() |
![]() |