![]() |
![]() |

ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం సమంత అక్కినేని 'సామ్ జామ్' అనే టాక్ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఫిల్మ్, స్పోర్ట్స్ రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనుంది. మొదటగా విజయ్ దేవరకొండతో ఆమె చేసిన ఇంటర్వ్యూ ఇటీవలే స్ట్రీమింగ్ అయ్యింది. అందులో సమంత అడిగిన ప్రశ్నలకు తన పర్సనల్ లైఫ్, సినిమాల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు విజయ్. అంతే కాదు ఇంట్లో తాము ఆడే ఆటలను గురించి కూడా చెప్పాడు.
లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది సమంత. దీనికి సంబంధించిన కొన్ని పిక్చర్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆ పిక్చర్సలో సమంతతో చాటింగ్ చేయడాన్ని మెగాస్టార్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే షోకు హాజరైన ఆడియెన్స్‌తోనూ ఇంటరాక్ట్ అయినట్లు ఆయన బాడీ లాంగ్వేజ్‌ను బట్టి అర్థమవుతోంది.
సమంత వైట్ డ్రస్, దానిపైన రెడ్ కలర్ బ్లేజర్ ధరించి ఆకట్టుకుంటుండగా, చిరంజీవి గ్రీన్ బ్లేజర్, వైట్ టీ షర్ట్, బ్రౌన్ ప్యాంట్‌లో డాపర్ లుక్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ చాట్ షో స్ట్రీమింగ్ కానున్నది. మరోవైపు 'ఆచార్య' షూటింగ్ సెట్స్‌పైకి వచ్చేందుకు చిరు రెడీ అవుతున్నారు.


![]() |
![]() |