![]() |
![]() |
డిసెంబర్ 22న విడుదలైన ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ ‘సలార్’ సందడి ఆల్రెడీ ముగిసింది. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన భారీ సినిమాలతో ‘సలార్’ని పక్కన పెట్టారు. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘సలార్’ యూనిట్ ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్విరాజ్ సుకుమారన్ పాల్గొన్న ఓ ఇంటర్యూను విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూను హోంబలే ఫిలింస్ యూ ట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ సరదాగా ప్రభాస్‌ని కొన్ని ప్రశ్నలు అడిగింది. దానికి ప్రభాస్ కూడా అంతే సరదాగా సమాధానం చెప్పాడు.
‘ఈ సినిమా స్టార్ట్ అయినపుడు డార్లింగ్‌తో సినిమా చేస్తున్నావా’ అని అందరూ అడిగారు. అవును చేస్తున్నాను అని చెప్పారు. ప్రభాస్‌ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ, వారం తర్వాత తనని అలా ఎందుకు పిలుస్తారో అర్థమైంది. నిజంగా ప్రభాస్ డార్లింగే’ అంది శ్రుతిహాసన్. ఇంతలో పృథ్విరాజ్ కల్పించుకొని ‘ప్రభాస్‌ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసు. కానీ, రెబల్‌స్టార్ అని ఎందుకు పిలుస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’ అన్నాడు. వెంటనే శ్రుతిహాసన్ కూడా ‘అవునూ.. నిన్ను అందరూ రెబల్‌స్టార్ అని ఎందుకు పిలుస్తారు?’ అని అడిగింది. దానికి ప్రభాస్ సమాధానమిస్తూ ‘మా అంకుల్ రెబల్‌స్టార్..’ అన్నాడు. ‘ఓహో మీ అంకుల్ నుంచి ఆ పేరు నీకు వచ్చిందన్నమాట’ అని తనకు తనే సమాధానం చెప్పుకుంది.
![]() |
![]() |