![]() |
![]() |
ప్రో కబడ్డీ లీగ్ సీజన్10 జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నివాసంలో తెలుగు టైటాన్స్ ప్లేయర్లు సందడి చేశారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్10లో కొన్ని మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం తెలుగు టైటాన్స్ తలపడనుంది.
ఈ సందర్భంగా ప్లేయర్స్ హైదరాబాద్ చేరుకున్నారు. బాలయ్యను కలిసిన ఆటగాళ్ళు తెలుగు టైటాన్స్ జెర్సీని అందజేశారు. శుక్రవారం జరిగే మ్యాచ్‌కు రావాల్సిందిగా బాలయ్యను ఆహ్వానించారు. బాలయ్యను కలుసుకున్న వారిలో తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్, కోచ్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఆటగాళ్లతో కలిసి బాలయ్య తొడకొట్టారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే బాలకృష్ణ, కెప్టెన్ షెరావత్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రోకబడ్డీ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలకృష్ణ వున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆటగాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేశారు.
![]() |
![]() |