![]() |
![]() |
.webp)
టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాలలో 'దేవర' ఒకటి. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో.. ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
'దేవర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలోనే దేవర రైట్స్ కోసం ఆ సంస్థ భారీగా వెచ్చించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ అమౌంట్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేసేలా నెట్ ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
![]() |
![]() |