![]() |
![]() |

ఈ ఏడాది తెలుగు నుంచి రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమానే రాలేదు. ఆ లోటుని తీర్చడానికే అన్నట్టుగా 'సలార్' వస్తోంది. ఈ సినిమా రూ.500 కోట్లు కాదు, రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ గా నిలవాలంటే దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
నైజాంలో రూ.60 కోట్లు, సీడెడ్ లో రూ.24 కోట్లు, ఆంధ్రాలో రూ.60 కోట్లు బిజినెస్ చేసిన సలార్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.144 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ఇక కర్ణాటక రూ.30 కోట్లు, తమిళనాడు రూ.12 కోట్లు, కేరళ రూ.6 కోట్లు, హిందీ రూ.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.3 కోట్లు, ఓవర్సీస్ రూ.75 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.345 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా. అంటే సలార్ మూవీ హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.345 కోట్లకు పైగా షేర్ లేదా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. బాహుబలి-2(రూ.352 కోట్లు) తర్వాత ప్రభాస్ కెరీర్ లో అత్యధిక బిజినెస్ చేసిన రెండో సినిమాగా సలార్ నిలిచింది.
సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపుకి అనుమతి లభించింది. ఈ లెక్కన హిట్ టాక్ రాకపోయినా.. యావరేజ్ టు అబోవ్ యావరేజ్ టాక్ వచ్చిన చాలు.. రూ.700 కోట్ల గ్రాస్ టార్గెట్ అనేది సలార్ కి పెద్ద విషయం కాదని ట్రేడ్ వర్గాల మాట. మొదటిరోజే ఈ సినిమా రూ.180-200 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని అంచనా.
సలార్ థియేట్రికల్ బిజినెస్:
నైజాం: రూ.60 కోట్లు
సీడెడ్ : రూ.24 కోట్లు
ఆంధ్ర: రూ.60 కోట్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి: రూ.144 కోట్లు
కర్ణాటక: రూ.30 కోట్లు
తమిళనాడు : రూ.12 కోట్లు
కేరళ: రూ.6 కోట్లు
హిందీ: రూ.75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ.3 కోట్లు
ఓవర్సీస్: రూ.75 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్: రూ.345 కోట్లు
![]() |
![]() |