![]() |
![]() |

ఒకప్పుడు స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే.. టికెట్ల కోసం థియేటర్ల దగ్గర అభిమానులు క్యూలు కట్టేవాళ్ళు. క్యూలో నిల్చొని అభిమాన హీరో సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడం అనేది అప్పట్లో గొప్ప విషయం. ఇప్పుడు ఆ ట్రెండ్ కి మళ్ళీ శ్రీకారం చుట్టింది 'సలార్' మూవీ. థియేటర్ల దగ్గర అసలుసిసలైన సినిమా పండుగను తీసుకొచ్చింది.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడంతా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కి అలవాటు పడిపోయారు. ఇలాంటి తరుణంలో ఆఫ్ లైన్ బుకింగ్ కి తెరతీసింది సలార్ టీం. కొన్ని థియేటర్ల టికెట్ కౌంటర్ల వద్ద సలార్ ఫస్ట్ డే టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతో అభిమానులు క్యూలు కడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద.. వందల సంఖ్యలో అభిమానులు కిలోమీటరుకు పైగా క్యూ లైన్ లో నిల్చున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టికెట్ల కోసం థియేటర్ దగ్గర ఈ సందడిని చూసి అప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రియులు.
![]() |
![]() |